మలబద్దక సమస్య వల్ల చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు, అయితే మీరు ముఖ్యంగా వేడి చేసే ఆహారాలు తీసుకోవద్దు, అలాగే చికెన్ మటన్ వీటికి దూరంగా ఉండాలి.. అంతేకాదు మీరు ఎక్కువగా నీరు తీసుకోవాలి.
డీహైడ్రేట్ అయిపోవడం వల్ల మలబద్ధకం సమస్య వస్తుంది. అందుకే నీరు కచ్చితంగా ఐదు లీటర్లు తాగాలి రోజూ..
ఎప్పుడైతే ఎక్కువ నీళ్లు తాగుతారో అప్పుడు ఈ సమస్య నుంచి సులభంగా బయట పడవచ్చు.
ఇక చాలా మంది షుగర్ కలిపిన షోడాలు డ్రింకులు తాగుతారు దీని వల్ల ఇంకా ఎక్కువ అవుతుంది ఇవి తాగద్దు. ఇక ఫుడ్ ఏది తీసుకోవాలి అంటే మీరు ఆపిల్ కమలాలు అరటిపండు పుచ్చకాయ బొప్పాలి కర్బూజా ఇలాంటి పండ్లు తీసుకోండి.. రోజుకి ఒకటి తీసుకున్నా చాలు. దీని వల్ల మలం సాఫీగా వస్తుంది.
మీ డైట్ లో ఫైబర్ ఎక్కువగా ఉన్నట్టు తీసుకోవడం వల్ల ఈ సమస్య నుండి బయట పడవచ్చు.చిక్కుడు, బీన్స్, గింజలు వంటి వాటిలో ఫైబర్ ఉంటుంది, అలాగే తాజా కాయకూరలు ఆకుకూరలు తీసుకోండి.. ఇక ఎక్కువ సేపు కూర్చోకుండా వ్యాయామం వాకింగ్ చేయండి…ప్రోబయోటిక్ ఉన్న ఫుడ్ తీసుకోండి ఇవి యోగర్ట్, కించిలో వెల్లుల్లి, అరటిపళ్ళు, ఉల్లిపాయలు ఉంటాయి, సో మజ్జిగ పెరుగు కూడా తీసుకోండి దీని వల్ల మల విసర్జన సాఫీగా జరుగుతుంది.