వైసీపీ చేతికి తెలుగులో ఓ ప్రముఖ మీడియా

వైసీపీ చేతికి తెలుగులో ఓ ప్రముఖ మీడియా

0
99

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు సాక్షి తప్ప మరో ఛానల్ లేదు .. జగన్ గొంతు అలాగే వైసీపీ వాయిస్ వినిపించే ఛానల్ అంటే కేవలం సాక్షి అని మాత్రమే చెబుతారు.. మరి జగన్ కూడా కొత్త మీడియా పెట్టాలి మనకు మీడియా సపోర్ట్ ఉండాలి అని దాదాపు రెండు సంవత్సరాలుగా అనుకున్నారు.. రాజం పేట ఎంపీ మిథున్ రెడ్డి ఒక మీడియా స్టార్ట్ చేస్తారు అని అనుకున్నారు.. మొత్తం విజయవాడ వేదికగా ఇది స్టార్ట్ చేయాలి అని అనుకున్నారు, కాని ఇది జరగలేదు.. అయితే చంద్రబాబుకు ఉన్న మీడియా ఫాలోయింగ్ తెలిసిందే, ఇక ఇప్పుడు తాజాగా ఇదే విషయం చర్చించుకుంటున్నారు వైసీపీ నేతలు. మనకు మరో మీడియా సపోర్ట్ ఉండాలి అని అనుకుంటున్నారు.

ఎందుకు అంటే ఏపీలో ఉన్న మీడియాలలో 90 శాతం చంద్రబాబుకు సపోర్ట్ ఉన్నాయి.. దీంతో వైసీపీ ఎప్పుడు అయినా ఏదైనా ఎలక్ట్రానిక్ మీడియా అమ్మే స్దితికి వస్తే, పార్టీలో పారిశ్రామిక వేత్తల ద్వారా తమ హస్తగతం చేసుకోవాలి అని చూస్తోంది .. తాజాగా కోమటిరెడ్డి బ్రదర్స్ కు చెందిన రాజ్ న్యూస్ ను ఇప్పుడు వైసీపీ తీసుకుంటుంది అని వార్తలు వస్తున్నాయి.. అంతా ఎంపీ విజయసాయిరెడ్డి వెనుక నుంచి చూస్తున్నారు అని తెలుస్తోంది.. ఈ మీడియాని ఓ ప్రముఖ పారిశ్రామిక వేత్త తీసుకోవాలి అని భావిస్తున్నారట.. ఇప్పుడు ఇదే పెద్ద చర్చ జరుగుతున్న అంశం. బయటకు విషయాలు రాకపోయినా వైసీపీ తన హస్త గతం చేసుకోవాలి అని చూస్తోంది.. ఇది వైసీపీకీ గుడ్ న్యూస్ అనే చెప్పాలి.. కాని రాజ్ న్యూస్ అని పేరు ఉంచుతారా లేదా కొత్త పేరు పెడతారా అనేది మాత్రం డౌట్ .