మే 23 న జగన్ సరికొత్త నిర్ణయం

మే 23 న జగన్ సరికొత్త నిర్ణయం

0
44

తెలుగుదేశం పార్టీ నేతలు వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ఎన్నికలు అయిన తర్వాత కూడా విమర్శలు చేస్తున్నారు. ఒకరిపై ఒకరు విమర్శల బాణాలు సందించుకుంటున్నారు.. తాజాగా ఇదే అంశం ఏపీలో చర్చకు వస్తోంది. దేశంలో ఎన్నికలు ముగిసిన చోట ఇంత పెద్దఎత్తున విమర్శలు లేవు.. కేవలం ఏపీలో మాత్రమే ఇలా జరుగుతోంది. జగన్ అప్పుడే గెలిచేశామనే భ్రమల్లో బతుకుతున్నాడని, 2014 ఎన్నికల సమయంలో కూడా ఇలాగే మేకపోతు గాంభీర్యం పోయి.. తోక ముడిచాడని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. డేరా బాబాకు విజయసాయిరెడ్డికి మధ్య ఉన్న సంబంధం ఏమిటో తెలియచేయాలి అని అన్నారు ఆయన.

జగన్ మోదీ కలిసి పోయారు అని అవినీతి పరులకు సాయం చేస్తున్నారు అని ఆయన విమర్శించారు. జగన్ అవినీతి పత్రిక చానల్ ద్వారా చంద్రబాబు పై విమర్శలు చేస్తున్నారు అని, అవినీతి సొమ్ముదాచుకోవడం జగన్ కు తెలుసు అని ఆయన విమర్శించారు.ప్రజలు వాస్తవాలు గ్రహించారని, ఫ్యాన్ రెక్కలు విరిగిపోయేలా తీర్పు చెప్పారని బుద్ధా ఫలితాలపై జోస్యం చెప్పారు. ప్రజలు ఇచ్చే తీర్పుతో జగన్, మోడీలు మూటాముల్లె సర్దుకోవడం ఖాయమని తెలిపారు. ఫలితాల తర్వాత జగన్ ఫ్యాన్ వాడటమే మానేస్తారని వ్యంగ్యాస్త్రం సంధించారు. తాను తుదిశ్వాస వరకూ టీడీపీలో బాబు వెనుకే కొనసాగుతాను అని తెలియచేశారు.