గాజువాక రిజల్ట్ చెబుతున్న వైసీపీ నేత

(గాజువాక రిజల్ట్ చెబుతున్న వైసీపీ నేత

0
47

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, విశాఖ జిల్లా నుంచి గాజువాకలో పోటీ చేశారు.. అయితే గాజువాకలో పవన్ పక్కాగా గెలుస్తారు అని అనేక సర్వేలు చెబుతున్నాయట, ఇదే జనసేన నేతలు చెబుతున్నారు.. ఇక భీమవరంలో వైసీపీకి ఎడ్జ్ ఉంది అని తెలుస్తోంది.. అయితే వైసీపీ నేత పృధ్వీ ఇప్పటికే గాజువాక గురించి అక్కడ పవన్ గెలుపు గురించి కామెంట్ చేశారు. అక్కడ తెలుగుదేశం అభ్యర్ది పల్లా శ్రీనివాసరావు వారి శ్రేణులు అంతా జనసేన కు ఓటెయ్యమని వారి యువతకు చెప్పారని దీంతో, వారు నచ్చక రివర్స్ అయ్యారు అని, ఆ తెలుగుదేశం పార్టీ నేతలు కేడర్ కూడా అందరూ వైసీపీ నేత తిప్పల నాగిరెడ్డికి ఓటు వేయడానికి ఇష్టం చూపించారట.. ఇది అక్కడ జరిగింది అని కాని పవన్ కల్యాణ్ కు ఓట్లు పడ్డాయి అని జనసేన చెప్పుకుంటోంది….కాని ఓట్లు నిజంగా జనసేనకు పడలేదు అని, ఇదంతా వైసీపీకి ప్లస్ అయింది అని ఇటీవల కమెడియన్ వైసీపీ నేత పృధ్వీ తెలియచేశారు..

దీంతో జనసేన నేతల్లో కలవరం మొదలైంది.. ఇదంతా తెలుగుదేశం జనసేన మధ్య రహస్య ఒప్పందం అని అంటున్నారు.. మొత్తానికి భీమవరంలో మాత్రం ఏ సర్వే చూసినా అక్కడ వైసీపీ గెలుస్తుంది అని అంటున్నారు.. మరి చూడాలి అక్కడ ఎవరు గెలుస్తారో ఏమిటో అనే అనుమానం మాత్రం ఇటు నేతల్లో పెరిగిపోయింది.