ఈ మెంటల్ టార్చర్ ని భరించలేను.. హృతిక్ సంచలన వ్యాఖ్యలు ..!

ఈ మెంటల్ టార్చర్ ని భరించలేను.. హృతిక్ సంచలన వ్యాఖ్యలు ..!

0
100

తన మాటల దాడితో స్టార్ హీరోలను కూడా వదిలి పెట్టకుండా ఒక ఆట ఆడుకుంటుంది బాలీవుడ్ నటి కంగనా. అమే పేరు ఎత్తలంటెనే చాల మంది భయపడి పోతుంటారు. అయితే అమే బాలివుడ్ హిరో హిరోయిన్లను ఎవరిని వదిలిపెట్టదు. అది సీనియార్ అయినా జునియార్ అయినా అమేకు బలి కావలిసిందే. తాజా గా హృతిక్ కంగనా గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. ఇంతకి ఎం జరిగిందంటే ఇప్పటికే పలు వేదికలపై హృతిక్ ని మాటలతోనే టార్చర్ పెట్టిన క్వీన్ .. ఇప్పుడు ప్రొఫెషనల్ గానూ అవాంచిత యుద్ధం ప్రారంభించింది. ఇటీవలే హృతిక్ నటించిన సూపర్ 30 రిలీజ్ తేదీని టీమ్ ప్రకటించింది. జూలై 26 న రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు.

సరిగ్గా అదే సమయంలో కంగన నటించిన మెంటల్ హై క్యా చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నామని ఏక్తా కపూర్ ప్రకటించడం సంచలనమైంది. ఆ క్రమంలోనే కంగన అసలు గేమ్ స్టార్ట్ చేసింది. హృతిక్ ని టీజ్ చేస్తూ మా సినిమా రిలీజవుతోంది. హృతిక్ తన సినిమాని వాయిదా వేసుకోవడం గ్యారెంటీ అంటూ ఆట పట్టించింది. ఆ వ్యాఖ్యను అంతే సీరియస్ గా తీసుకున్న హృతిక్ సూపర్ 30 సినిమాకి కొత్త రిలీజ్ తేదీని ప్రకటిస్తామని సోషల్ మీడియా ద్వారా వెల్లడించడం సంచలనమైంది. కంగన వల్ల తాను ఎంత మనోవేదన అనుభవిస్తున్నది హృతిక్ ఒక సుదీర్ఘ మైన నోట్ ద్వారా వ్యక్తం చేసిన తీరు ప్రస్తుతం బాలీవుడ్ లో సంచలంగా మారింది. విషపూరిత మెంటల్ టార్చర్ అనుభవిస్తున్నా! నన్ను నేను కాపాడుకునేందుకు రిలీజ్ తేదీని మార్చమని నిర్మాతల్ని అభ్యర్థిస్తున్నా.. అంటూ హృతిక్ ఎంతో మనోవేదనను కనబరిచాడు. దీంతో ఆయన అభిమానుల్లో కొంత నిరాశని మిగిల్చింది తమ అభిమాన హిరో సినిమాను చుడడానికి ఎంతో అత్రుతగా ఉన్న అభిమానులు హృతిక్ నిర్ణయానికి బాదపఢుతున్నారు.