ఏపీలో ఇప్పటికే అనేక సర్వేలు వైరల్ అవుతున్నాయి.. ఒకటి కాదు రెండు కాదు అనేక సర్వేలు ఇప్పుడు మార్కెట్లో విచ్చలవిడిగా వైరల్ అవుతున్నాయి.. ఇందులో ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది తెలియకుండా మారిపోయింది ఈ వెబ్ ప్రపంచం.. ఇక నేషనల్ మీడియాల నుంచి సాధారణంగా జనం దగ్గర అభిప్రాయం తీసుకునే పల్స్ సర్వేలు అన్నీ వైసీపీ ఏపీలో అధికారంలోకి వస్తుంది అని చెబుతున్నాయి.. ఇలా అన్ని సర్వేలు వైసీపీకి ఫేవర్ గా రావడంతో, మరో పక్క తెలుగుదేశం పార్టీకి షాక్ తగులుతోంది.. నిజంగా రిజల్ట్ రాకుండానే నెలరోజులుగా ఫలితాల విషయంలో టీడీపీకి ఇబ్బందికర పరిస్దితి ఎదురు అవుతోంది.. ఇప్పడు కత్తి మహేష్ సర్వే చేశారట ఇది కూడా ఇప్పుడు ఏపీ పొలిటికల్ కారిడార్లో వైరల్ అవుతోంది అయితే కత్తి సూటిగా తన సర్వే చెప్పారు
ఇప్పుడున్న పరిస్థితుల మేర మొత్తం 60 నుంచి 65 అసెంబ్లీ స్థానాలు అలాగే పూర్తిగా 25 పార్లమెంటు స్థానాలలోనూ పర్యటించానని ఎక్కడకి వెళ్లినా సరే ప్రజలు అంతా సమూలమైన మార్పును కోరుకుంటున్నారని తన విశ్లేషణలో అర్ధమయ్యిందని కత్తి మహేష్ తెలిపాడు.అలాగే ఈసారి చంద్రబాబు గెలుస్తారు అని భావిస్తున్నారు కాని ప్రజలు ఆయనను గెలిపించరు అని మార్పు కోరుకుంటున్నారు అని ఆయన అన్నారు..తాను చేపట్టిన సర్వే ప్రకారం ఈసారి జగన్ ఎలాంటి అడ్డంకులు లేకుండా 100 నుంచి 110 స్థానాలు పక్కాగా గెలుపొందుతారని కత్తి తేల్చి చెప్పేసాడు. దీంతో కత్తిమహేష్ సర్వే నిజం అవుతుంది అని చెబుతున్నారు చాలా మంది. అంతేకాదు కత్తి కూడా తాను నిజంగా సర్వే చేశాను అని దాదాపు 60 సెగ్మెంట్లు తిరిగి ప్రజల ఓపినియన్ తెలుసుకున్నాను అని చెబుతున్నారు మహేష్, మరి చూడాలి ఆయన సర్వే ఫలితాలను ఎలా ఇస్తుందో.