పిట్టలదొరతో బాబుకు విజయసాయిరెడ్డి పంచ్

పిట్టలదొరతో బాబుకు విజయసాయిరెడ్డి పంచ్

0
88

మొత్తానికి వీలు చిక్కినప్పుడు అల్లా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వైసీపీ తరపున తన గళం వినిపిస్తారు ..సీఎం చంద్రాబు ప్రభుత్వం పై ఈ ఐదు సంవత్సరాలు పోరాటం చేస్తూనే ఉన్నారు. అంతేకాదు పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలను సాక్ష్యాలతో సహా నిరూపించారు. అయితే బాబుపై ఈమధ్య ట్విట్టర్లో విమర్శల బాణాలు వదులుతున్నారు విజయసాయిరెడ్డి. తాజాగ ఆనేడు ఆయన వదలిని విమర్శల ట్వీట్ టీడీపీ నేతలకు కాక పుట్టించింది మరి ఆ ట్వీట్లు చూద్దాం

ఊహకందని కోతలతో గ్రామాల్లో ఆహ్లాదాన్ని పంచే పిట్టల దొరలు, తుపాకి రాముళ్లను మించి పోయాడు చంద్రబాబు. రాష్ట్రంలో కనీసం 30 అసెంబ్లీ స్థానాల్లో గెలిచే సీన్ లేదు. అనుకూల మీడియాతో ప్రధాని రేసులో ఉన్నాడని ‘కలల’ కథనాలు రాయించుకుంటున్నాడు. ప్రధాని పదవేమో కానీ జైలుకు వెళ్లడం మాత్రం ఖాయం.

చంద్రబాబు సమీక్షలకు వెళ్లాలంటే పార్టీ నాయకులు భయపడుతున్నారట. తన కుల(తొలి) వెలుగు కేసుల్లో ఇరుక్కుంటే కనీసం మాట సాయం చేయలేని పరిస్థితి. ఆ కోపమంతా తమపై ప్రదర్శిస్తున్నాడని తమ్ముళ్లు వాపోతున్నారట. మామూలుగా నైతే మీడియాపై దాడి అని రెచ్చిపోయేవాడు. అని విజయసాయిరెడ్డి ట్వీట్ల బాణాలు సంధిస్తున్నారు.