ఏపీలో హీట్ పుట్టిస్తున్న ప్రముఖ ఛానల్ సర్వే

ఏపీలో హీట్ పుట్టిస్తున్న ప్రముఖ ఛానల్ సర్వే

0
34

గత ఎన్నికల సమయంలో ఏపీలో రాజకీయంగా జగన్ సీఎం అవుతారు అని అందరూ భావించారు.. అయితే ఆ సమయంలో జగన్ వేవ్స్ అలాగే ఉన్నాయి.. కాని పవన్ బాబు మోదీ కలిసి ఎన్నికల్లో పోటీ చేయడంతో ఇటు వైసీపీ దారుణంగా ఓటమి పాలైంది..ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ప్రముఖ ఛానల్ సర్వే2014లో కొత్త సెగలు రాజేసింది.. ఇది ఎవరూ మర్చిపోలేని సర్వే, కాని ఫలితాలు మాత్రం రివర్స్ అయ్యాయి..ఈ సర్వే ఎన్నికలకు రెండు నెలల ముందు చేయడం, అలాగే మోదీతో బాబు పవన్ కలిసిపోటీ చేయడం ఇవన్నీ ఒక్క 15 రోజుల్లో రాజకీయాన్ని మొత్తం మార్చేశాయి. అయితే ఎక్కడా ఫెయిల్ అనేది లేని ఈ సర్వే ఈసారి కూడా ఏపీలో సర్వే నిర్వహించిందట.

ఏపీ ఎన్నికల పోలింగ్ ముగిసిన రెండు రోజులకు, అంటే ఏప్రిల్ 13 నుంచి ఏపీ లో పర్యటిస్తూ చేసిన సర్వే నివేదికను ప్రముఖ ఛానల్ బృందం అదే నెల అంటే ఏప్రిల్ 20వ తేదీన అందజేసింది. మొత్తానికి ఏపీలో ఈసారి ఒక ప్రముఖ ఛానల్ సర్వే బృందం అందజేసిన నివేదిక ప్రకారం, ఏపీ అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం 110 నుంచి 115, వైఎస్ఆర్ కాంగ్రెస్ 50 నుంచి 55, జనసేన 3 – 8 అసెంబ్లీ సీట్లను గెలుపొందే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆ సర్వే నివేదిక వెల్లడించింది. ఇక పార్లమెంట్ స్థానాల విషయానికొస్తే, 18 నుంచి 20 స్థానాలు టీడీపీ ఖాతాలో పడనున్నాయని, అలాగే వైసీపీకి 4 నుంచి 6, జనసేన 0 – 1 స్థానం గెలుపొందే అవకాశాలు ఉన్నాయని తెలియచేసింది. ఇప్పుడు ఈ సర్వే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. మరి నిజంగా ఈసారి ఇలాంటి ఫలితాలు వస్తే ,ఇది టీడీపీకి ప్లస్ అనే చెప్పాలి.