కేసీఆర్ కు మాట ఇచ్చిన జగన్

కేసీఆర్ కు మాట ఇచ్చిన జగన్

0
38

నిజమే కేసీఆర్ మొత్తం దక్షిణాది రాష్ట్రాలను ఏకం చేయాలి అని చూస్తున్నారు.. తృతీయ కూటమి ద్వారా కేంద్రంలో చక్రం తిప్పాలి అని చూస్తున్నారు ..అయితే కేసీఆర్ ఆశలపై కొందరు నీళ్లు చల్లుతున్నారు, ఇటు చంద్రబాబు కూడా చాలా ఉత్సాహంగా కేంద్రంలో రాహుల్ ప్రధాని అవ్వాలి అని ప్రయత్నాలు చేస్తున్నారు.. అలాగే ప్రచారాలు చేస్తున్నారు. అయితే కేంద్రంలో ఈసారి తృతీయ కూటమికి అవకాశం రావాలి అంటే, కేవలం అది ప్రాంతీయ పార్టీలు మెజార్టీ సీట్లు సాధిస్తేనే అని చెప్పాలి.. ఇటు కాంగ్రెస్ పార్టీ చెప్పుకోదగిన విధంగా సౌత్ లో లేదు, ఇటు బీజేపీ కూడా అసలే కష్టమైన పరిస్దితిలో ఉంది.

అందుకే ఇరు పార్టీలకు గెలుపు సులభం కాదు అని చెబుతున్నాయి సర్వేలు.. ఇక కేసీఆర్ జగన్ తో చర్చించారు, ఫెడరల్ ఫ్రంట్ కు సాయం చేయాలి కలిసి రావాలి అని కోరారు, జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది అని తెలుస్తోంది. ఈ రెండు పార్టీలు ఏపీకి మోసం చేశాయి కాబట్టి కచ్చితంగా తృతీయ కూటమికి అవకాశం ఇవ్వాలి అని జగన్ చూస్తున్నారు .. ఇక కేసీఆర్ కు జగన్ మాట ఇచ్చారట, అందుకే మొత్తం 35 నుంచి 40 సీట్లు మన తెలుగు రాష్ట్రాల నుంచి మనకు సపోర్ట్ గా ఉంటాయి అని భావిస్తున్నారు.. మొత్తానికి మెజార్టీ రాకపోతే మాత్రం కేసీఆర్ చక్రం తిప్పే అవకాశం ఉంది. జగన్ ఈ సమయంలో ప్రత్యేక హోదా అంశం పై ప్రశ్నించి, ఏ పార్టీ మద్దతు ఇస్తుందో వారికి మద్దతు ఇస్తారు అనేది తెలుస్తోంది.