జగన్ ని నమ్మిన ఈ ఇద్దరు నేతలకు షాక్ తప్పదా

జగన్ ని నమ్మిన ఈ ఇద్దరు నేతలకు షాక్ తప్పదా

0
55

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇద్దరు నాయకులకి మెండి చేయి చూపించనున్నారట.. గెలిచిన తర్వాత అది చేయనున్నారట.. ఇప్పుడు ఇదే వార్త చిత్తూరు జిల్లాలో చర్చించుకుంటున్నారు. అవును జగన్ సీఎం అవుతారు అని అన్ని సర్వేలు చెబుతున్నాయి. అంతేకాదు సీఎం అయిన తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం పులివెందులలో ఏర్పాటు చేస్తున్నారు అని వార్తలు వినిపించాయి.. మరి ఇందులో వాస్తవం తెలియదు, అంతేకాదు మంత్రి పదవులు కూడాసోషల్ మీడియాలో వైరల్ అయిన వారికి కొందరికి ఇవ్వనున్నారని వార్తలు వినిపించాయి.

కాని ఇవన్నీ ఫేక్ అని కొట్టిపారేశారు వైసీపీ నేతేలు.. ఇక తాజాగా చిత్తూరు జిల్లాలో ఇద్దరు నేతలకు మంత్రి పదవులు ఇవ్వాలి అని జగన్ ఆలోచన చేస్తున్నారట. అయితే వారు ఇద్దరూ తప్పకుండా గెలిచే నేతలు అని చెబుతున్నారు. అందులో నగరి నుంచి రోజా గెలిస్తే , ఆమెకు కచ్చితంగా మంత్రి పదవి ఇస్తారట, ఇక జగన్ కు ముందు నుంచి ఆర్దికంగా వెన్నుదన్నుగా ఉండి జిల్లా రాజకీయాలు అన్నీ చూసుకున్న పుంగనూరు వైసీపీ అభ్యర్ది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కూడా మంత్రి పదవి దక్కనుంది అని తెలుస్తోంది. అయితే ఇక్కడ జిల్లాలో ఇద్దరు నేతలకు మంత్రి పదవులు ఫిక్స్ అయ్యాయి, ఇంకా మరో ఇద్దరు సీనియర్ నేతలు జగన్ వెన్నంటి ఉన్న నేతలకు హ్యాండ్ తప్పదు అని అంటున్నారు.

ఇక చెవిరెడ్డి భాస్కర రెడ్డి అలాగే భూమన కరుణాకర్ రెడ్డికి ఇద్దరికి మంత్రి పదువుల రావు అని చెబుతున్నారు ..ఒకవేళ రెండు మూడు సంవత్సరాల తర్వాత ఏమైనా మంత్రి వర్గ విస్తరణ చేస్తే వారికి అవకాశం ఉండచ్చు అని అంటున్నారు పార్టీ జిల్లా నేతలు. మరి జగన్ ఆలోచన ఎలా ఉందో.