బాలయ్య చిన్న అల్లుడికి హ్యాండ్ బలంగా వైసీపీ వేవ్స్

బాలయ్య చిన్న అల్లుడికి హ్యాండ్ బలంగా వైసీపీ వేవ్స్

0
34

ఈసారి సీఎం చంద్రబాబు కుటుంబం నుంచి తెలుగుదేశంలో మొత్తం ఇద్దరు ఎన్నికల్లో నిలబడ్డారు, చంద్రబాబుతో సహా ఆయన తనయుడు లోకేష్ కూడా మంగళగిరి నుంచి పోటీ చేశారు. ఇక నందమూరి కుటుంబం నుంచి బాలయ్య హిందూపురం నుంచి నిలబడ్డారు, ఆయన చిన్న అల్లుడు శ్రీభరత్ కూడా ఎంపీగా విశాఖ నుంచి పోటీ చేశారు. అయితే ఇక్కడ బాలయ్య సోదరి దగ్గుబాటి వారి కోడలు పురందేశ్వరి కూడా బీజేపీ నుంచి పోటీ చేశారు, ఎంపీగా జనసేన నుంచి మాజీ సీబీఐ జేడి లక్ష్మీనారాయణ కూడా పోటీ చేశారు.

ఇక్కడ ప్రసెంట్ టాక్ మొత్తం ఎన్నికల ముందు ఒకలా ఉంది ఇప్పుడు మాత్రం మారిపోయింది. ఎందుకు అంటే ఇక్కడ ఈసారి గెలుపు వైసీపీకి వస్తుంది అని చెబుతున్నారు జనం. ఇక్కడ జనసేన వైసీపీ మధ్య మాత్రమే పోటి జరిగింది అని చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీకి అంత మెజార్టీ రాకపోవచ్చు అని చెబుతున్నారు.. ఇక ఇక్కడ నుంచి బాలయ్య చిన్నల్లుడు శ్రీభరత్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు, కాని ఆయనకు ఈసారి గెలుపురాదు అని తెలుస్తోంది. ఇక్కడ విశ్లేషకులు కూడా అదే చెబుతున్నారు.. ముఖ్యంగా కొత్తగా రాజకీయాల్లోకి ఆయన అప్పటికప్పుడు ఎంట్రీ ఇవ్వడం, అలాగే కుటుంబ పెత్తనం కూడా ఉంటుంది అని కొందరు తమ అభిప్రాయంగా చెప్పారట. అలాగే రాజకీయంగా అనుభవం లేదు అని, పైగా పోటీ చేస్తున్న అందరూ కూడా సీనియర్లు అని, ఇటు నాలుగు పార్టీల నుంచి పోటీ ఉండటంతో ఓట్ల చీలక ఎక్కువ ఇక్కడ ఉంటుంది అని, అది వైసీపీకి పాజిటీవ్ అవుతుంది అని తేలిందట. అయితే ఇప్పుడు టికెట్ వచ్చింది కాబట్టి వచ్చేసారికి మరింత పార్టీ తరపున కృషి చేస్తే, విజయం వచ్చే అవకాశం ఉంటుంది అని చెబుతున్నారట జిల్లా నేతలు.