టీమిండియా తదుపరి కెప్టెన్ అతను కావచ్చు — అజారుద్దీన్

టీమిండియా తదుపరి కెప్టెన్ అతను కావచ్చు --- అజారుద్దీన్

0
89
 కోహ్లీ తరువాత భారత క్రికెట్ జట్టు కెప్టెన్ గా ఎవరికి అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు ఆటతీరు చూసి చాలా మంది చెప్పే పేరు రిషబ్ పంత్.. అయితే తాజాగా చాలా మంది క్రీడా అభిమానులు ఇదే అనుకుంటున్నారు, తాజాగా
మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ఇదే అభిప్రాయపడ్డారు. మరో వారంలో మొదలయ్యే ఐపీఎల్ 14వ సీజన్ కు ఢిల్లీ కాపిటల్స్ జట్టు సారధిగా పంత్ పేరును ప్రకటించడంపై అజార్ స్పందించారు..
యువ ఆటగాడిగా వికెట్ కీపర్ గా జట్టులో అతను కీలక ప్లేయర్ అని తెలిపారు… పంత్ కెప్టెన్ గా రాణిస్తాడు అని నమ్మకం ఉంది అన్నారు….పంత్ గత కొంతకాలంగా అన్ని ఫార్మాట్లలో సత్తా చాటుతున్నాడని ప్రశంసించారు.. అంతేకాదు  భవిష్యత్తులో భారత జట్టు కెప్టెన్ రేసులో అతని పేరు సెలక్టర్ల దృష్టిలో ముందు ఉన్నా ఆశ్చర్యపోవక్కర్లేదు అన్నారు.
పంత్ దూకుడైన ఆటతీరు ఇండియాను మరింత ఉన్నత స్థితికి చేరుస్తుందని ట్వీట్ లో తెలిపారు అజార్ ..ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా పంత్ ను ప్రకటించడంపై అందరూ హర్షిస్తున్నారు,  పంత్ పై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.