రైలు జర్నీ చేస్తున్నారా ? ఇక రాత్రిపూట ట్రైన్స్లో ఈ సర్వీసులు అందుబాటులో ఉండవు

రైలు జర్నీ చేస్తున్నారా ? ఇక రాత్రిపూట ట్రైన్స్లో ఈ సర్వీసులు అందుబాటులో ఉండవు

0
90

మనలో చాలా మంది రైలు ప్రయాణం చేస్తూ ఉంటారు, అయితే మీరు ఈ విషయాన్ని కచ్చితంగా తెలుసుకోవాలి.

ఇండియన్ రైల్వేస్ కొన్ని రూల్స్ను మార్చేసింది. దీంతో ప్రయాణికులపై నేరుగానే ప్రభావం పడే అవకాశముంది.. ఇక చాలా మంది రైలులో ఎక్కిన తర్వాత అక్కడ చార్జింగ్ పాయింట్ లో బోగీలో చార్జింగ్ పెట్టుకుంటున్నారు… ఇలా మనలో చాలా మంది ఈ చార్జింగ్ పాయింట్లలో చార్జింగ్ పెట్టుకున్నాం.

 

రైల్వే ప్రయాణికులు రాత్రి పూట వారి స్మార్ట్ఫోన్స్, ల్యాప్టాప్స్ వంటి వాటికి చార్జింగ్ పెట్టుకోవడం తెలిసిందే, అయితే ఇక ఇది రాత్రి పూట కుదరదు.. కేవలం ఉదయం పూట మాత్రమే కుదురుతుంది.. దొంగతనాలు, మంటలు వంటి అంశాల నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఇండియన్ రైల్వేస్ తెలిపింది. ఇక మీరు నైట్ ట్రైన్ ఎక్కితే కచ్చితంగా ఫోన్లు ల్యాప్ ట్యాప్స్ ఫుల్ చార్జ్ పెట్టుకోండి.

 

రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు మీరు చార్జింగ్ పెట్టుకోవడం వీలు కాదు.. చాలా మంది చార్జింగ్ పెట్టి నిద్రలోకి వెళుతున్నారు. ఈలోపు సెల్ ఫోన్ దింగిలిస్తున్నారు దొంగలు… ఇలా కొందరు చార్జ్ పెట్టి హెడ్ ఫోన్స్ పెట్టుకుని పడుకుంటున్నారు ఇవి పేలుతున్నాయి.. ఇక మీరు నైట్ జర్నీలో ఇది కచ్చితంగా గుర్తు ఉంచుకోండి. ఇది మంచి నిర్ణయమే అంటున్నారు ప్రయాణికులు.