మార్కెట్ ని షేక్ చేస్తున్న నిమ్మకాయలు ఎందుకంటే

మార్కెట్ ని షేక్ చేస్తున్న నిమ్మకాయలు ఎందుకంటే

0
88

ఈ వేసవి వచ్చింది అంటే ఫ్రూట్స్ కు గిరాకి ఉంటుంది.. ముఖ్యంగా అరటి పండ్లు అలాగే నిమ్మకాయలకు మంచి గిరాకీ ఉంటుంది, ఇక ఈ ఎండల నుంచి ఉపశమనం కోసం చాలా మంది నిమ్మరసం తాగుతారు… అందుకే గిరాకీ బట్టి ధర కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే కావాల్సినంత పంట వస్తే ఒకే లేదు అంటే ఇక దిగుబడి తగ్గినా మార్కెట్లో డిమాండ్ కు తగ్గ సప్లై లేకపోయినా

నిమ్మకాయ రేటు అమాంతం పెరుగుతుంది.

 

ప్రస్తుతం వాటి దిగుమతి పడిపోవడంతో ధరలు పెరిగిపోతున్నాయి. తెలంగాణలోని ఆదిలాబాద్ మార్కెట్లో గతంలో ఒక నిమ్మకాయ రూ.2కే అమ్మేవారు. ఇప్పుడు ఏకంగా ఐదు రూపాయలకు పెరిగింది. ఇక చాలా మంది ఈ రేటుకి కొందాం అనుకుంటున్నా స్టాక్ దొరకడం లేదట.

 

దీంతో ఇతర జిల్లాల నుంచి వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు. డిమాండ్ ఇలాగే ఉంటే ఇక్కడ నిమ్మకాయలు

ధర మరింత పెరుగుతాయి అంటున్నారు వ్యాపారులు.