ఈరోజుల్లో ప్రతీ ఒక్కరు జీన్స్ ధరిస్తున్నారు, ఎక్కడ చూసినా జీన్స్ ఫ్యాంట్లు షర్టులే ఎక్కువ వాడుతున్నారు.. అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా ఇలాంటి బట్టలు వాడుతున్నారు, అయితే జీన్స్ మరి ఉతకచ్చా ఉతకకూడదా అంటే ?అసలు బట్టలు ఉతకకపోతే చాలా ఇబ్బంది.. కాని దీనిని ఉతకడానికి ఓ టెక్నిక్ ఉంటుంది అని చెబుతున్నారు..
జీన్స్ని పదే పదే ఉతకడం మంచి పద్దతి కాదంటున్నారు. ప్రపంచంలోని మొట్టమొదటి జీన్స్ సృష్టికర్త, జీన్స్ కంపెనీ లెవిస్ CEO చిప్ బెర్గ్ ..జీన్స్ ని ఎప్పుడూ ఉతకకూడదని చెప్పారు.
మీరు వేసుకునే జీన్స్ పై మరకపడితే టూత్ బ్రష్ తో శుభ్రం చేయాలి.. మీరు జీన్స్ ఉతకడం వల్ల దాని పదార్దం దెబ్బ తింటుంది.
నీరు కూడా వృథా అవుతుందని చిప్ బెర్గ్ సూచించాడు. అయితే కొత్త జీన్స్ కొంటే దాదాపు ఆరు నెలల వరకూ అలాగే వాడుకోవాలి… మరీ మురికి అయితే చలి నీటితోనే ఉతకాలి… వేడి నీరు వాడకూడదు.. అలాగే అన్ని బట్టలు కలిపి జీన్స్ తో ఉతక్కూడదు. ఇక ఎండలో ఎక్కువ సేపు ఉంచకూడదు.. సుమారు ఓ గంట కంటే ఎక్కువ వద్దు అని చెబుతున్నారు… వాషింగ్ మెషీన్లో కాకుండా చేతితో జీన్స్ శుభ్రం చేయాలి.
.