పని పాతర పెట్టి… ఏదో జాతర పోయిందట అని తెలంగాణలో పాపులర్ సామెత. అలాంటి ఘటనకు పాల్పడ్డారు ఒక పోలీసు అధికారి. ఇగ ఈ సక్కదనం బాలేదని ఉన్నతాధికారులు ఆయన మీద వేటు వేశారు. పూర్తి వివరాలు చదవండి.
జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఎస్సై అనీల్ నిన్న శుక్రవారం ఒక అక్కడే పనిచేసే యువతితో కీసర పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక రిసార్ట్ లో రాసలీలలకు దిగాడు.
ఈ విషయం జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి కీసర పోలీసులకు పక్కాగా సమాచారం అందింది. దీంతో వారు రిసార్ట్ మీద రైడ్ చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సదరు ఎస్సైని రాచకొండ కమిషనరేట్ కు అటాచ్ చేశారు. ఆయన మీద ఎలాంటి కేసు ఫైల్ చేయలేదు.
దీంతో ఈ విషయంలో అన్ని కోణాల్లో విచారణ జరిపిన రాచకొండ కమిషనర్ మహేష్ ఎం భగవత్ శనివారం నాడు సదరు ఎస్సై అనీల్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
వ్యక్తిగత స్వేచ్ఛగా దీన్ని చూడాలా? లేదంటే నేరంగా చూడాలా అన్నదానిపై అన్ని కోణాల్లో పోలీసు ఉన్నతాధికారులు కసరత్తు చేశారు.
సదరు ఎస్సై తన స్టేషన్ లో పనిచేస్తున్న మహిళతో డ్యూటీ లో ఉన్న సమయంలో రాసలీలలకు పాల్పడాన్ని నేరంగా పరిగణించినట్లు తెలిసింది. దాంతొపాటు నైతిక విలువలు కోల్పోయి ప్రవర్తించడాన్ని కూడా ఉన్నతాధికారులు సీరియస్ గా తీసుకున్నట్లు తెలిసింది.
దీంతో రాసలీలల ఎస్సై పై సస్పెన్షన్ వేటు పడింది.