శని అమావాస్య రోజున ఎట్టి పరిస్ధితిలో ఈ పనులు చేయకూడదు

shani amavasya day special story

0
85

శని అమావాస్య రోజున స్వామికి అభిషేకం చేస్తారు భక్తులు. తమపై శని ప్రభావం ఉండకూడదు అని ఉపవాస దీక్ష చేస్తారు. ఇక ఉదయమే స్వామికి అభిషేకం చేసి ఒంటిపద్దు ఉంటారు.శని అమావాస్య రోజున శనీశ్వర ఆలయాలు భక్తులతో కిటకిటలాడతాయి. అయితే ఈరోజు కొన్ని పనులు అస్సలు చేయకూడదు అంటున్నారు పండితులు.మరి ఆ కార్యాలు ఏమిటి అనేది చూద్దాం.

బియ్యం, గోధుమలను శని అమావాస్య రోజున దూరంగా ఉంచండి. అంటే ఆహారంలో తీసుకోవద్దు, ఆరోజు మిత ఆహారం తీసుకుని ఒంటిపద్దు ఉండాలి. ఇక మాంసాహారం తీసుకోకూడదు.ఉల్లిపాయ, వెల్లుల్లి తో ఉన్న ఆహారాన్ని తినవద్దు. పొగాకు,మద్యానికి దూరంగా ఉండాలి. బ్రహ్మచర్యం పాటించాలి.

ఎవరితోనూ వాదన చేయవద్దు. ఏ చెడు పని చేయకూడదు. ఇక దానం చేయడం చాలా మంచిది. నువ్వుల ఆహారం ఈరోజు అస్సలు తీసుకోకూడదు. అలాగే నల్ల బట్టలు ధరించకూడదు.