తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యదాద్రి పునర్ నిర్మాణం పనులు శర వేగంగా సాగుతున్నాయి. యదాద్రి ఆలయ నిర్మాణ పనులు ఎప్పటికప్పుడు తానే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇందులో భాగంగానే సిఎం కేసీఆర్ రేపు ఆదివారం నాడు యాదాద్రిని సందర్శించి , యాదాద్రి పనుల పురోగతిని పరిశీలించనున్నారు.
కేసీఆర్‌తో పాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, గవర్నర్ తమిళి సై లు సైతం యాదాద్రికి వెళ్లనున్నారు.
భారత ప్రధాన న్యాయమూర్తి హోదాలో మొదటిసారి యాదాద్రిని ఎన్వీ రమణ దర్శించుకోనున్నారు.
సీజేఐ హోదాలో వస్తుండటంతో ఘనంగా స్వాగతం పలికేందుకు ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు. యాదాద్రి కి ఒకే సారి సిఎం , గవర్నర్ , భారత ప్రధాన న్యాయమూర్తి వస్తున్నందున పటిష్ఠమైన భద్రతా చర్యలు చేపట్టారు తెలంగాణ పోలీసులు.