బిగ్ బాస్ షోలో ఆమె పారితోషికం ఎంతో తెలిస్తే షాకే!

బిగ్ బాస్ షోలో ఆమె పారితోషికం ఎంతో తెలిస్తే షాకే!

0
147

కొన్నాళ్ల క్రితం తొలుత బాలీవుడ్ పరిశ్రమలో ప్రవేశించిన బిగ్ బాస్ షో, అక్కడ మంచి విజయం మరియు ప్రేక్షకుల రేటింగ్ సంపాదించింది. అయితే ఆ తరువాత ఆ షోని కేవలం ఒక జాతీయ షో గానే కాకుండా దానిని ప్రాంతీయ షో గా కూడా గుర్తింపు తీసుకురావాలనే తలంపుతో ఆ తరువాత షో ని తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ తదితర ప్రాంతీయ భాషల్లో కూడా రూపొందిస్తున్నారు. ఇప్పటికే మన తెలుగులో సీజన్ 1 మంచి రేటింగ్ సంపాదించిన విషయం తెలిసిందే. తెలుగులో ప్రస్తుతం నాని హోస్ట్ గా సీజన్ 2 జరుగుతోంది. తమిళ్ లో అయితే సీజన్ 2 జరుగుతోంది. ఇక మలయాళంలో తొలి సీజన్ మోహన్ లాల్ హోస్ట్ గా ఇటీవల ప్రారంభమైంది. కాగా ఈ షోలో పాల్గొనే పలువురు సెలెబ్రెటీలకు ఇస్తున్న పారితోషికం విని ప్రజలు నివ్వెరబోతున్నారు.

తెలుగు వలె మొత్తం 16 మంది పార్టిసిపంట్స్ వుండే ఈ షోలో కంటెస్టెంట్ లలో ఒకరైన హీరోయిన్ శ్వేతా మీనన్ కు ఏకంగా రోజుకు రూ. 1లక్ష ఇచేలా బిగ్ బాస్ టీమ్ ఒప్పందం చేసుకుందనేది మలయాళ చిత్ర పరిశ్రమ టాక్. ఇక మాజీ మిస్ కేరళ, ప్రముఖ యాంకర్ రంజినీ హరిదాస్‌కు రోజుకు రూ.80వేలు మరియు ప్రముఖ హాస్యనటుడు అనూప్‌ చంద్రన్‌‌కు రూ. 71 వేలు, నటి పర్లేమానేకు రూ.50వేలు, టీవీ నటి అర్చన సుశీలన్‌కు రూ.30 వేలు, నటి హిమాశంకర్ రూ.20వేలు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చున్నట్టు సమాచారం. దీన్ని బట్టి చూస్తే ఇక మన తెలుగు కంటెస్టెంట్ లకు కూడా భారీగానే పారితోషికం రూపంలో ముట్టజెప్పి ఉంటారని విశ్లేషకులు అంటున్నారు…