పరుగుల వీరుడు, లెజండరీ అథ్లెట్ మిల్కాసింగ్ అంటే మన దేశంలో తెలియని వారు ఉండరు.ఆయన వయసు 91 సంవత్సరాలు. ఇక ఆయన లేరు అనే వార్త తెలిసి క్రీడాలోకం షాక్ కి గురి అయింది. మిల్కా సింగ్ మరణం రాజకీయ, వ్యాపార, సినిమా రంగ ప్రముఖులను విస్మయానికి గురిచేసింది. కరోనాతో 30 రోజులుగా పోరాటం చేసి ఆయన కోలుకున్నారు, తర్వాత మరికొన్ని అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు.
ఆయన మరణంపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇతర ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.ఎందరికో స్పూర్తిగా నిలిచిన మిల్కా సింగ్ నిష్క్రమణతో ప్రపంచ వ్యాప్తంగా ఆయన అభిమానులు శోకసంద్రంలో ముగినిపోయారు.
ఆయన గురించి ప్రతీ ఒక్కరు కంటతడిపెట్టుకున్నారు. ఆయన అందరికి ఇన్సిపిరేషన్ అని కొనియాడారు. అన్నీ రంగాల క్రీడాకారులు ఆయన గురించి ట్విట్లర్ వేదికగా నివాళి అర్పిస్తున్నారు. మిల్కా సింగ్ భార్య, ఇండియన్ ఉమెన్ నేషనల్ వాలీబాల్ జట్టు మాజీ కెప్టెన్ నిర్మల్ మిల్కా సింగ్. ఈ నెల13న కోవిడ్ కారణంగానే కన్నుమూశారు, ఇప్పుడు ఆయన కూడా కన్నుమూశారు.