హరీశ్ శంకర్ దర్శకత్వంలో ‘వాల్మీకి’ రూపొందుతోంది. తమిళంలో కొంతకాలం క్రితం వచ్చిన ‘జిగర్తాండ’కి ఇది రీమేక్. ఆ సినిమాలో బాబీసింహా పోషించిన పాత్రను వరుణ్ తేజ్ .. సిద్ధార్థ్ పోషించిన పాత్రను అధర్వ మురళి చేస్తున్నారు. ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే అలరించనుంది.
ఈ సినిమా షూటింగు రెగ్యులర్ గా కొనసాగుతూనే వుంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేసుకున్నారు. సెప్టెంబర్ 6వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఆ విషయాన్ని స్పష్టం చేస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేశారు. మిక్కీ జె.మేయర్ సంగీతాన్ని సమకూర్చుతోన్న ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి వుంది.