జగన్ క్యాబినెట్ చర్చలు.. ఆ నిర్ణయానికి క్యాబినెట్ ఆమోదం..!!

జగన్ క్యాబినెట్ చర్చలు.. ఆ నిర్ణయానికి క్యాబినెట్ ఆమోదం..!!

0
47

ఏపీ సీఎంగా జగన్ బాధ్యతలు స్వీకరించాక పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. వాటిలో ఆశా వర్కర్ల వేతనం పెంపు ఒకటి. నెలకు రూ.3000 గా ఉన్న ఆశా వర్కర్ల జీతాన్ని రూ.10,000కు పెంచుతూ సీఎం హోదాలో జగన్ ఫైలుపై సంతకం చేశారు. ఇప్పుడా పెంపుకు రాష్ట్ర మంత్రివర్గం కూడా ఆమోదం తెలిపింది. ఇక పాలనాపరమైన ఉత్తర్వులు వెలువడిన వెంటనే పెంపు నిర్ణయం అమల్లోకి రానుంది.

అటు, సామాజిక పెన్షన్లు రూ,2,250 పెంచుతూ తీసుకున్న నిర్ణయం కూడా క్యాబినెట్ ఆమోదానికి నోచుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ చెల్లింపునకు కూడా మంత్రివర్గ సభ్యులు పచ్చజెండా ఊపారు. మరోవైపు, ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రతిపాదనకు కూడా క్యాబినెట్ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్టు సమాచారం. అయితే, దీనిపై అధ్యయనం చేసేందుకు కమిటీ ఏర్పాటు చేసి, ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ముందుకెళ్లనున్నారు. వీలైనంత త్వరగా ప్రక్రియ మొదలుపెట్టాలని, తద్వారా ఆర్టీసీపై వస్తున్న అపోహలను, ఆర్టీసీ ఉద్యోగుల్లో నెలకొన్న అభద్రతాభావాన్ని తొలగించాలని జగన్ సర్కారు భావిస్తోంది. క్యాబినెట్ భేటీ సందర్భంగా వైఎస్సార్ రైతు భరోసా అమలుపైనా ఎక్కువసేపు చర్చ జరిగినట్టు తెలుస్తోంది.