ఐటీ గ్రిడ్ కేసులో అశోక్‌కు ముందస్తు బెయిల్ మంజూరు

ఐటీ గ్రిడ్ కేసులో అశోక్‌కు ముందస్తు బెయిల్ మంజూరు

0
47

హైకోర్టులో ఐటీ గ్రిడ్స్ కేసులో అశోక్‌కు ఊరట లభించింది. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అశోక్‌కు షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. అయితే వారంలో ఒకరోజు పోలీసు విచారణకు హాజరు కావాలని అశోక్‌ను హైకోర్టు ఆదేశించింది.

మొదట్లో సెషన్స్ కోర్టు ఆయనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసేందుకు నిరాకరించింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. తనపై కుట్ర పూరితంగా కేసు నమోదు చేశారని ఆరోపించారు. ప్రజలకు సంబంధించి ఎలాంటి సమాచారాన్ని తాము సేకరించలేదన్నారు.

నేడు ఈ కేసును విచారించిన హైకోర్టు ధర్మాసనం ఇరువురి వాదనలు విన్న అనంతరం అశోక్‌కు అనుకూలంగా తీర్పు వెల్లడించింది. ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. వారానికి ఒక రోజు పోలీసుల ఎదుట విచారణకు హాజరుకావాల్సిందిగా అశోక్‌ను హైకోర్టు ఆదేశించింది.