ప్రకృతి మనకు ఎంతో ఇస్తోంది. కానీ మనం వాటిని సద్వినియోగం చేసుకోవడం లేదు. అనేర రకాల జబ్బులకి ప్రకృతి నుంచి వచ్చిన ఔషదాలే మనం వాడుతున్నాం. అయితే పండ్లు, కూరగాయలు, ఆకులు, బెరడులు, ఇలా ప్రతీ దానిలో కూడా మనిషి శరీరానికి మేలు చేసే ఎన్నో సుగుణాలు ఉన్నాయి. వాటిని మనం గుర్తించాలి అంతే. అర్జున వృక్షం కూడా మనకు ఎంతో మేలు చేస్తుంది. మరి ఈ అర్జున వృక్షం మన దేశంలో చాలా బాగా పెరుగుతుంది.
ఈ అర్జున వృక్షాన్ని తెల్లమద్ది అని కూడా పిలుస్తారు.అయితే ఎక్కువగా కలపగా ఉపయోగించే ఈ వృక్షాన్ని ఆయుర్వేద ఔషధాల్లోనూ వాడుతారు. తెలుపు, ఎరుపు రంగులో ఈ చెట్టు పెరుగుతుంది. అనేక రకాల మందుల తయారీలో దీనిని వాడతారు. ఆస్తమా గుండె జబ్బులను ఇది తగ్గిస్తుంది. ఈ చెట్టు బెరడులో కాల్షియం, అల్యూమినియం, మెగ్నిషియం అధికంగా ఉంటాయి.
ఇది రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. గుండె కు రక్తప్రసరణ సజావుగా సాగేలా చేస్తుంది. ఈ బెరడుతో ఇలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. అంతేకాదు అనేక రకాల ఆయుర్వేద మందులు అలాగే, మెడిసన్ తయారీకి కూడా ఈ బెరడు ఆకులు వాడతారు.