విషాదం – ప్రపంచంలో అతి పెద్ద గుర్రం చనిపోయింది

The world's largest horse died

0
77

గుర్రాలను చాలా మంది పెంచుకుంటారు. ముఖ్యంగా రేసులకి కూడా వాడతారు. అయితే ప్రపంచంలోనే పొడుగైన అరుదైన గుర్రం మృతి చెందింది. బిగ్ జాక్ అనే 20 సంవత్సరాల వయస్సున్న ఈ ఎత్తైన గుర్రం 2010 లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ తన పేరుమీద నమోదు చేసింది. నేడు ఈ గుర్రం చనిపోయింది.

బిగ్ జాక్ బెల్జియన్ జాతికి చెందింది. అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రం, కొలంబియా కౌంటీలోని పోయ్నెట్టి గ్రామంలో ఓ గుర్రపు శాలలో దీనిని పెంచుతున్నారు. నిర్వాహకులు దీని ఆలనాపాలనా చూశారు. ఈ గుర్రం కాస్త రెండు వారాల నుంచి అస్వస్థతతో ఉంది. చివరకు ఇలాగే ఇబ్బంది పడుతూ మృతి చెందింది. ఈ విషయాన్ని బిగ్ జాక్ యజమాని జెర్రీ గిల్బర్ట్ భార్య వలీషియా గిల్బర్ట్ వెల్లడించారు.

ఇక దాని యజమానులు ఏం చెబుతునన్నారంటే, ఇది ఇంతకాలం ఏ స్టాల్ ఓ ఉందో అది ఖాళీగా ఉంచుతాం. అక్కడ మరో గుర్రాన్ని ఉంచము అని తెలిపారు. ఓ ఫలకంపై బిగ్ జాక్ బొమ్మ వేయించి. దాని పేరును చెక్కించి స్టాల్ బయట ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. బిగ్ జాక్ 109 కిలోల బరువుతో పుట్టింది. చివరి రోజుల్లో దాని బరువు 1,136 కిలోలు.బిగ్ జాక్ 6.10 అడుగులు ఎత్తు ఉండేది.