తమిళ హీరోతో జాతిరత్నాలు దర్శకుడు మూవీ ?

Jatiratnalu director movie with Tamil hero?

0
187

తమిళ స్టార్ హీరోలు తెలుగు మార్కెట్ పై కూడా ఫోకస్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే తమిళ సినిమాలను తెలుగులో డబ్ చేసి సూపర్ హిట్ అందుకున్న హీరోలు, నేరుగా తెలుగు సినిమాలు చేసేందుకు సిద్దం అవుతున్నారు.తమిళ హీరోలు, విజయ్, ధనుష్లు తమ తెలుగు సినిమాలు ప్రకటించారు. ఇంకొందరు మన దర్శకుల నుంచి కథలు వింటున్నారు.

జాతిరత్నాలు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అనుదీప్, తమిళ హీరోతో ఓ సినిమా చేయబోతున్నారట. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఆయన ఎవరో కాదు, రెమో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన శివ కార్తికేయన్ . ఇప్పుడు ఆయన జాతిరత్నాలు దర్శకుడితో తెలుగులో సినిమా చేయబోతున్నారట.

Shiva Karthikeyan

కొద్ది రోజుల క్రితం ఈ దర్శకుడు జాతిరత్నాలు సిక్వెల్ చేస్తున్నట్లుగా టాక్ వినిపించింది. కానీ అనుహ్యాంగా ఇప్పుడు శివ కార్తికేయన్ పేరు వినిపించడం ఇటు టాలీవుడ్, కోలీవుడ్ లో దీని గురించి మాట్లాడుకుంటున్నారు. తెలుగు, తమిళంలో మాత్రమే కాకుండా హిందీ, మలయాళంలో కూడా ఈ చిత్రం చేయబోతున్నారట. ఇక ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ నటించనున్నారు అని
తెలుస్తోంది. చూడాలి దీనిపై అఫిషియల్ ప్రకటన వచ్చే వరకూ వెయిట్ చేయాల్సిందే.