15 రోజుల పాటు ప్రపంచం అంతా ఈ విశ్వ క్రీడలను చూసింది. నేడు టోక్యో ఒలింపిక్స్ ముగిశాయి. జపాన్ రాజధాని టోక్యోలో కొద్దిసేపటి కింద ఒలింపిక్స్ ముగింపు ఉత్సవాలు నిర్వహించారు. ముగింపు వేడుకులు సాధారణంగా జరిగాయి. జూలై నెల 23న ఒలింపిక్ క్రీడలు ప్రారంభం అయ్యాయి. ఓపక్క కరోనా ముప్పు ఉన్నా జపాన్ ప్రభుత్వం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది.
కట్టుదిట్టమైన బయో బబుల్ నిబంధనలు అమలు చేసి సజావుగా ఒలింపిక్స్ నిర్వహించి అందరి ప్రశసంలు అందుకుంది. ఇక ఎక్కువ పతకాలు గెలుచుకున్న దేశం అమెరికా. అగ్రరాజ్యం మొదటిస్దానంలో ఉండి చైనాని వెనక్కి నెట్టింది. మరి ఏఏ దేశాలు ఎన్ని పతకాలు సాధించాయో చూద్దాం.
1. అమెరికా 39 స్వర్ణాలు ,41 రజతాలు ,33 కాంస్యాలు మొత్తం 113 పతకాలు
2. చైనా 38 పసిడి పతకాలు ,32 రజతాలు,18 కాంస్యాలు మొత్తం 88 పతకాలు
3. జపాన్ 27 స్వర్ణాలతో మూడో స్థానంలో నిలిచింది
4. బ్రిటన్ 22 స్వర్ణాలు
5.రష్యా ఒలింపిక్ 20 స్వర్ణాలు గెలుచుకుంది.