ఇప్పుడు నీరజ్ పేరు దేశం అంతా మార్మోగిపోతోంది. టోక్యో ఒలింపిక్స్ 2021లో భారత్కు స్వర్ణ పతకం అందించి నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. భారత్ అథ్లెటిక్స్లో స్వర్ణ పతకం ఖాతాలో వేసుకుంది. జావెలిన్ త్రో ఈవెంట్లో నీరజ్ చోప్రా 87.58 మీటర్లు విసిరి స్వర్ణ పతకం గెలిచాడు. అయితే నీరజ్ చోప్రాకి అనేక బహుమతులు వస్తున్నాయి. హరియాణా ప్రభుత్వం క్లాస్-1 జాబ్ కూడా ఆఫర్ చేసింది. విలువైన స్థలాన్ని కూడా తక్కువ ధరకే ఇస్తాము అని తెలిపింది.
కొన్ని కంపెనీలు నీరజ్ అనే పేరు ఉన్న వారికి బహుమతులు ఆఫర్లు ఇస్తున్నాయి. ఉచిత పెట్రోల్, అలాగే ఫ్రీ రైడ్స్ ఆఫర్లు ఇస్తున్నాయి. దీంతో నీరజ్ అనే పేరుతో ఉన్న వాళ్ల పంట పండింది. గుజరాత్లోని భరూచ్లోని ఒక పెట్రోల్ పంపు యాజమాన్యం ఉచిత పెట్రోల్ ఆఫర్ ప్రకటించింది. నీరజ్ అనే పేరు ఉన్న వారికి సోమవారం సాయంత్రం 5 గంటల వరకు ఉచిత పెట్రోల్ ఆఫర్ ప్రకటించింది.
చాలా మంది ఐడీ కార్డ్ తీసుకువచ్చి పెట్రోల్ ఉచితంగా పోయించుకున్నారు. అలాగే గుజరాత్లోని జునాగఢ్లో ఉన్న గిర్నార్ రోప్వే కంపెనీ ఆగస్టు 20 వరకు ఈ నీరజ్ అనే పేరుతో ఉన్న వారు ఉచితంగా ప్రయాణించవచ్చని కంపెనీ ప్రకటించింది.