ఈ దేశ అధ్యక్షుడు రాజీనామా చేసి ఇక దేశాన్ని విడిచి వెళ్లిపోయారు.అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ అఫ్గానిస్తాన్ నుంచి తజకిస్తాన్కు వెళ్లిపోయినట్లు రిపోర్టులు వచ్చాయి. ఘనీ, ఆయన భార్య, చీఫ్ ఆఫ్ స్టాఫ్, దేశ భద్రతా సలహాదారు ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్కు వెళ్లారని మరో వార్త వినిపిస్తోంది . రక్తపాతాన్ని నివారించేందుకే తాను రాజధాని నగరాన్ని వీడుతున్నట్లు అఫ్గానిస్తాన్ పౌరులను ఉద్దేశించి ఘనీ ఫేస్బుక్లో ఒక పోస్టు చేశారు.
కాబుల్ ఎయిర్ పోర్టు దగ్గర వేలాది మంది ఉంటున్నారు. అక్కడ ఉన్న విదేశీయులు అంతేకాకుండా అధికారులు కొందరు ధనవంతులు ఆ దేశాన్ని విడిచి వెళ్లిపోతున్నారు. యూకే, జర్మనీ, కెనడా, అమెరికా లాంటి దేశాలు వారి మిలటరీ సాయంతో పౌరులని తీసుకువెళుతున్నాయి. మరోపక్క తాము మాత్రం ఎవరికి హని చేయమని ఇక్కడ సంతోషంగా ఉండవచ్చని చెబుతున్నారు.
శారీరక దండన, బాలికలు పాఠశాలకు వెళ్లడంపై నిషేధం ఇలా షరియా చట్టం అమలు చేస్తారనే ఆందోళనల్లో చాలా మంది జనం ఉంటున్నారు. మూడు లక్షల మందితో ఉన్నఅఫ్గానిస్తాన్ సైన్యం 50 వేల నుంచి లక్ష మధ్య మాత్రమే ఉన్న తాలిబన్లను నిలువరిస్తుంది అని అందరూ అనుకున్నారు. కాని ఇలా జరగలేదు అని అంటున్నారు మేధావులు.