ఇదంతా టెక్నాలజీ యుగం ప్రతీ ఒక్కరు టెక్నాలజీతో పాటు అప్ డేట్ అవుతున్నారు. ముఖ్యంగా అన్ని రంగాల్లో కూడా మార్పులు వచ్చాయి. తాజాగా క్రికెట్ ఓ కూడా స్టార్టింగ్ నుంచి ఇప్పటికీ అనేక మార్పులు వచ్చాయి. క్రికెట్ లో ప్రతీ దానిని ఈజీగా కనిపెడుతున్నారు. బంతివేగం, కొట్టిన వేగం, ఎడ్జ్, వైడ్, అవుట్స్ ఇలా అన్నీ తెలుసుకుంటున్నారు టెక్నాలజీ సాయంతో. ముఖ్యంగా స్నిక్కో మీటర్, హాట్ స్పాట్, అల్ట్రా ఎడ్జ్, హాక్ ఐ, స్పైడర్ కెమెరాలు, స్పీడ్ గన్నులు, ఎల్ఈడీ స్టంపులు, వాటికి మైక్రోఫోన్ లు ఇలా అనేక పరికరాలు వచ్చాయి.
తాజాగా ఈ జాబితాలోకి స్మార్ట్ బాల్ వచ్చింది. ఏమిటి దీని స్పెషల్ అనుకుంటున్నారా, బంతి గమనాన్ని, వేగాన్ని, బౌన్స్ అయిన విధానాన్ని లెక్కించేందుకు ప్రత్యేకంగా తయారు చేసిన బంతి ఇది. ఈ బాల్ ఎలా పని చేస్తుంది అంటే ఇందులో ఓ స్మార్ట్ చిప్ ను పెడతారు. ఓ యాప్ కి ఇది అనుసంధానం అవుతుంది. బౌలర్ ఈ బాల్ తన చేతి నుంచి వదిలినప్పుడు ఆ బంతి ఎంత వేగంగా వెళుతుంది బ్యాట్ కి ఎంత వేగంతో తగిలింది ఇవన్నీ కూడా వేగాన్ని లెక్కిస్తుంది.
వెంటనే సెకన్ లో యాప్ కు పంపిస్తుంది. ఈ బాల్ ను కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో ప్రయోగాత్మకంగా వాడుతున్నారు. ఇది ఎవరైతే ట్రైనింగ్ తీసుకుంటున్నారో వారికి చాలా యూస్ అవుతుంది. కూకాబుర్రా సంస్థ ఈ స్మార్ట్ బాల్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిని 30 గంటలు ఈజీగా వాడవచ్చు ఈ బాల్ ఎంత వేగంగా కొట్టినా తట్టుకోగలదు.