టీ20 ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ధరించనున్న జెర్సీని భారత క్రికెట్ నియంత్రణ మండలి బుధవారం రివీల్ చేసింది. కిట్ స్పాన్సర్ ఎంపీఎల్ స్పోర్ట్స్‌తో సంయుక్తంగా బీసీసీఐ ఈ జెర్సీని రూపొందించింది. అయితే.. ఈ కొత్త జెర్సీ చిత్రాలను ప్రపంచ ప్రఖ్యాత కట్టడం బుర్జ్ ఖలీఫాపై ప్రదర్శించారు యూఏఈ అధికారులు. జెర్సీ విడుదలకు సంబంధించిన వీడియోను ప్లే చేశారు.
అభిమానులే స్ఫూర్తిగా టీమ్ఇండియా కొత్త జెర్సీని రూపొందించినట్లు బీసీసీఐ తెలిపింది. “అభిమానుల గుర్తుగా జెర్సీని రూపొందించడం భారత క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి. గత మేటి మ్యాచ్‌ల సందర్భంగా అభిమానులు చేసిన నినాదాలు, హర్షధ్వానాలు జెర్సీపై ఉంటాయి” అని ఎంపీల్ స్పోర్ట్స్ ఓ ప్రకటనలో తెలిపింది. అక్టోబర్ 18, 20న ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాతో జరగనున్న వార్మప్ మ్యాచ్‌ల్లో టీమ్ఇండియా ఈ కొత్త జెర్సీని ధరించనుంది