ఈ టీ20 ప్రపంచకప్ టోర్నీలో టీమ్‌ఇండియా అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉందని. అందులో అనేకమంది మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. అలాగే ఆ జట్టు ఆటగాళ్లంతా చాలా రోజులుగా ఇక్కడ ఐపీఎల్ ఆడారు. దీంతో ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడ్డారు. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా టైటిల్ ఫేవరెట్‌గా కనిపిస్తోంది” అని స్మిత్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
బుధవారం రాత్రి ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య రెండో వార్మప్ మ్యాచ్ జరిగింది. ఇక్కడ భారత్ తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఈనెల 24న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడేముందు పూర్తి ఆత్మవిశ్వాసం పెంపొందించుకుంది. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ అనంతరం స్మిత్ ఇలా తన అభిప్రాయాన్ని చెప్పాడు.
అనంతరం తన బ్యాటింగ్‌పై స్పందించిన అతడు..షాట్లు బాగా ఆడుతున్నట్లు చెప్పాడు. ఐపీఎల్‌లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడే అవకాశం రాలేదని, అయితే నెట్స్‌లో బాగా సాధన చేశానని తెలిపాడు. ఈ సందర్భంగా తన బ్యాటింగ్‌పై దృష్టి సారించి పరిస్థితులకు అలవాటు పడ్డానన్నాడు.