భారత్​- న్యూజిలాండ్..గెలిచిన జట్టుకే సెమీస్​ ఛాన్స్​!

India - New Zealand..Semis chance for the winning team!

0
90

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. ఆదివారం భారత్‌, న్యూజిలాండ్‌ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్​లో గెలిస్తేనే సెమీస్​కు చేరే అవకాశం ఉంది. గతవారం దాయాది జట్టుతో జరిగిన టీ20 ప్రపంచకప్‌ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిని ఎవరూ జీర్ణించుకోలేకపోయారు. తీవ్ర నిరాశ మిగిల్చిన ఈ మ్యాచ్‌ తర్వాత భారత్‌ తలపడనున్న మ్యాచ్‌లు తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాకౌట్‌ దశకు చేరాలంటే ఈ మ్యాచ్‌లో గెలవడం రెండు జట్లకు కీలకం.

సెమీస్‌ అవకాశాలు సజీవం చేసుకోవాలంటే న్యూజిలాండ్‌తో ఇవాళ జరిగే మ్యాచ్‌ను భారత్‌ తప్పక గెలవాల్సిందే. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో లోపాలను సరిదిద్దుకొని ఇవాళ కివీస్‌తో జరిగే కీలక సమరానికి కోహ్లీసేన సిద్ధమైంది. దుబాయ్‌ వేదికగా ఈ మ్యాచ్‌ ఈరోజు రాత్రి 7.30కి జరగబోతోంది.నాకౌట్‌ దశకు చేరాలంటే ఈ మ్యాచ్‌లో గెలవడం రెండు జట్లకు కీలకం. ఈ పోరులో గెలిస్తేనే సెమీస్​కు వెళ్తారు. మరి ఈ కీలక మ్యాచ్​లో ఎవరు గెలుస్తారో చూడాలి మరీ.

టీ20ల్లో కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లీకి ఇదే ఆఖరి టోర్నీ. ఇందులో నాకౌట్‌కు చేరకుండానే వెనుదిరిగితే వన్డే సారథ్య బాధ్యతల నుంచి కూడా కోహ్లీ తప్పుకోవాలనే డిమాండ్లు ఊపందుకుంటాయి. సాయంత్రం వేళల్లో మంచు ఎక్కువగా కురుస్తున్నందున టాస్‌ కూడా ఈ మ్యాచ్‌లో కీలకం కానుంది. టాస్‌ గెలిచే జట్టు ఛేజింగ్‌కు మొగ్గు చూపే అవకాశం ఉంది.

కివీస్‌, అఫ్గానిస్థాన్, స్కాట్లాండ్‌, నమీబియా మీద గెలిస్తే ఎలాంటి ఆటంకాలు లేకుండా టీమ్​ఇండియా సెమీస్‌కు చేరుకుంటుంది. ఒకవేళ కివీస్‌ మీద ఓడి, మిగతా జట్ల మీద విజయం సాధిస్తే.. అప్పుడు గ్రూప్‌లో ఇతర జట్ల మ్యాచ్‌ల ఫలితాల మీద ఆధారపడాల్సి ఉంటుంది. కాబట్టి మిగతా అన్ని మ్యాచులను భారత్‌ గెలవాలి. అప్పుడే ఎలాంటి సమీకరణాల లెక్క లేకుండా ముందుకెళ్లొచ్చు.