ఐపీఎల్: కొత్త జట్టుకు కోచ్ గా రవిశాస్త్రి

IPL: Ravi Shastri as the coach of the new team

0
98

టీ20 ప్రపంచకప్​ తర్వాత టీమ్​ఇండియా ప్రధాన కోచ్​గా తప్పుకోనున్న రవిశాస్త్రి .. ఐపీఎల్​ కొత్త జట్టు అహ్మదాబాద్​కు కోచ్​గా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై జట్టు యాజమాన్యం సీవీసీ క్యాపిటల్ ఇదివరకే శాస్త్రిని సంప్రదించిందట. అయితే మెగా ఈవెంట్​పై ప్రస్తుతం పూర్తిగా దృష్టి సారిస్తున్న నేపథ్యంలో దీనిపై శాస్త్రి తుది నిర్ణయం తెలియాల్సి ఉంది.

అహ్మదాబాద్ జట్టు​కు టీమ్​ఇండియా బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్​ కోచ్ ఆర్​.శ్రీధర్​ సహా ఇతర సహాయక సిబ్బందిని శాస్త్రి వెంటబెట్టుకెళ్తాడని తెలుస్తోంది. ఈ విషయమై త్వరలోనే స్పష్టత రానుంది. ఎందుకంటే డిసెంబర్​లో జరగనున్న ఐపీఎల్​ మెగా వేలంలో క్రికెటర్ల ఎంపికలో కోచ్​ కీలక పాత్ర పోషిస్తాడు.

వచ్చే ఏడాది ఐపీఎల్​లో మొత్తంగా 10 జట్లు పాల్గొననున్నాయి. అక్టోబర్​లో జరిగిన బిడ్డింగ్​ ప్రక్రియ అనంతరం అహ్మదాబాద్, లఖ్​నవూ జట్లు కొత్తగా చేరాయి. లఖ్​నవూ కోసం ఆర్​పీఎస్​జీ గ్రూప్​ రూ.7090 కోట్లు, అహ్మదాబాద్​కు సీవీసీ క్యాపిటల్​ రూ.5625 కోట్లు వెచ్చించాయి.