సీఎం కేసీఆర్ కామెంట్స్‌పై బండి సంజయ్ ప్రతి సవాల్

Bandi Sanjay breaks down on CM KCR comments

0
105

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన కామెంట్స్‌కు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. మీడియాతో మాట్లాడుతూ..తనదైన తరహాలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి మాట్లాడుతారని అంటే..పెట్రోల్, డీజిల్ ధర తగ్గింపుపై ప్రకటన ఉంటుందని ఆశించామని..అయితే తాను విమర్శలు చేశారని అన్నారు.

62 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని ప్రభుత్వం చెప్తోంది.. దీనిపై సర్వే జరగాలని కోరారు బండి సంజయ్. ధాన్యం కొనుగోలుపై కేంద్రం పెత్తనం ఏంటని గతంలో కేసీఆర్ అన్నారు. ఇప్పుడు.. ఏడేండ్ల నుంచి కేంద్రం ధాన్యం కొనుగోలు చేస్తుందా? ధాన్యం కొనుగోలుకు లక్ష కోట్లు ఖర్చు పెట్టామని అంటారు.  కేంద్రం ధాన్యం కొనట్లేదని మీరే అంటారు. దీనిపై సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలి డిమాండ్ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం 32-35 శాతం వ్యాట్ పెంచారు. లీటర్‌ పెట్రోల్‌పై తెలంగాణకు రూ.28 వస్తున్నాయని..కేంద్రానికి వచ్చే రూ.27లోను రాష్ట్రానికి రూ.12 వస్తున్నాయని వివరణ ఇచ్చారు. వ్యాట్ అత్యధికంగా విధించే రాష్ట్రాల్లో తెలంగాణ రెండోదన్నారు బండి సంజయ్. 24 రాష్ట్రాల్లో వ్యాట్ తగ్గించినప్పుడు తెలంగాణలో ఎందుకు తగ్గించరని ప్రశ్నించారు. కేంద్రం తెలంగాణకు రూ.2,52,908 కోట్లు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రూ. 40 వేల కోట్లే వచ్చాయని అబద్దాలు చెప్తోందని బండి సంజయ్ దుయ్యబట్టారు.