ఫైనల్​కు ముందు న్యూజిలాండ్ ​కు బిగ్ షాక్!

Big shock to New Zealand before the final!

0
78

అద్వితీయ ప్రదర్శనతో టీ20 ప్రపంచకప్​లో ఫైనల్లో ప్రవేశించింది న్యూజిలాండ్. ఈసారి ఎలాగైనా టైటిల్ గెలవాలన్న పట్టుదలతో ఉంది. ఈ సమయంలో ఈ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కివీస్ వికెట్ కీపర్, బ్యాటర్ డెవాన్ కాన్వే గాయం కారణంగా మెగాటోర్నీ ఫైనల్​కు దూరమయ్యాడు. అలాగే నవంబర్ 17 నుంచి జరగబోయే టీమ్ఇండియాతో టీ20 సిరీస్ కూ అందుబాటులో ఉండట్లేదు.

ఇంగ్లాండ్​తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ ​లో అద్భుత బ్యాటింగ్​తో అదరగొట్టాడు కాన్వే. 38 బంతుల్లో 46 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. కాగా, ఈ మ్యాచ్​లో ఔటయ్యాక అసంతృప్తితో పిడికిలితో బ్యాట్​ను బలంగా బాదాడు.

ఈ సమయంలోనే ఇతడి చేతివేలుకు గాయమైంది. స్కానింగ్​ చేసుకోగా చిటికిన వేలు విరిగినట్లు నిర్ధారణ అయింది. దీంతో కొంతకాలం పాటు అతడికి విశ్రాంతి అవసరమని సూచించారు వైద్యులు. ఔటయ్యాననే చిన్న అసంతృప్తితో చేసిన తప్పిదం ఇప్పుడు కీలక ఫైనల్​ పోరుతో పాటు టీమ్ఇండియాతో టీ20 సిరీస్​కు అతడు అందుబాటులో లేకుండా చేసింది.