ఆస్ట్రేలియా- న్యూజిలాండ్‌ ఢీ..టైటిల్ కొట్టేదెవరు?

Australia-New Zealand clash .. Who will win the title?

0
74

టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌ ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌ మధ్య ఆదివారం జరగనుంది.. ఈ రెండు పొరుగు దేశాల మధ్య పోరు ఆసక్తికరంగా మారనుంది. ఇక టోర్నీలో గెలుపు ఓటములను రుచిచూసి ఫైనల్స్‌కు చేరుకున్నారు రెండు జట్లు. మరి టైటిల్ ను ఎగరేసుకుపోయే జట్టు ఏదో తెలియాలంటే కొన్ని గంటలు ఆగాల్సిందే..

న్యూజిలాండ్ జట్టుకు ప్రధాన బలం ఆ జట్టు కెప్టెన్ విలియమ్సన్. అతనికి తోడుగా ప్రమాదకర గప్తిల్,  డారైల్ మిచెల్, నీషమ్ బ్యాటింగ్ లో దుమ్మురేపగల ఆటగాళ్లు. బౌలింగ్ లో బౌల్ట్, సౌథీ, సోది అదరగొడుతున్నారు. ఆస్ట్రేలియాకు ప్రమాదకర వార్నర్, ఫించ్ కీలకం కాగా మిడిలార్డర్ లో మిచెల్ మార్ష్ రాణించాల్సి ఉంది. అటు విధ్వంసక ప్లేయర్స్ మాక్స్ వెల్, స్టాయినిస్, వెడ్ ఉండనే ఉన్నారు. అటు బౌలింగ్ లో హేజిల్ వుడ్, జంపా, స్టార్క్ కమిన్స్ చెలరేగితే తిరుగుండదు.

టైటిల్‌ ఫేవరేట్లలో ఒకటిగా అడుగుపెట్టిన టీమ్‌ఇండియా తొలి మ్యాచ్‌లో పాక్‌ చేతిలో ఓడడం వల్ల భారత అభిమానులు తీవ్ర ఆవేదన చెందారు. రెండో మ్యాచ్‌లో కివీస్‌ చేతిలో ఓడి సెమీస్‌ ఆశలు దాదాపుగా చేజార్చుకున్న కారణంగా ఈ ప్రపంచకప్‌పైనే ఆసక్తి కోల్పోయారు. కానీ హోరాహోరీగా సాగిన రెండు సెమీస్‌ మ్యాచ్‌లు తిరిగి టోర్నీ వైపు కళ్లు తిప్పేలా చేశాయి.

అందుకు కచ్చితంగా న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా కారణం. రెండు సెమీస్‌ మ్యాచ్‌లూ కూడా ఒకే రకమైన ఉత్కంఠతో దాదాపుగా ఒకేలా సాగడం విశేషం. మొదట ఇంగ్లాండ్​పై మిచెల్‌, నీషమ్‌ మెరుపులతో ఛేదనలో కివీస్‌ 19వ ఓవర్లో గెలుపు అందుకోగా..రెండో సెమీస్‌లో పాకిస్థాన్​పై స్టోయినిస్‌, వేడ్‌ మెరుపులతో ఆసీస్‌ కూడా 19వ ఓవర్లోనే నెగ్గింది. రెండు జట్లూ ఓ దశలో ఓటమి దిశగా సాగి ఆఖర్లో సంచలన ప్రదర్శనతో అద్భుత విజయాలు అందుకున్నాయి. దీంతో టోర్నీపై మళ్లీ ఒక్కసారిగా ఆసక్తి పెరిగింది.

తుది పోరులో ఏ జట్టు గెలిచినా దాని ఖాతాలో తొలిసారి టీ20 ప్రపంచకప్‌ చేరనుంది. మరి వన్డేల్లో రికార్డు స్థాయిలో ఐదుసార్లు విశ్వవిజేతగా నిలిచిన కంగారూ జట్టు పొట్టి కప్పు బోణీ కొడుతుందా? లేదా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌గా నిలిచిన కివీస్‌ అదే జోరులో తొలిసారి టీ20 ఛాంపియన్‌గా నిలుస్తుందా అన్నది చూడాలి.`