భారత్-న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన రెండో టీ20ని వాయిదా వేయాలని ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. న్యాయవాది ధీరజ్ కుమార్.. ఝార్ఖండ్ హైకోర్టులో పిల్ వేశారు. మ్యాచ్ చూసేందుకు 100 శాతం ప్రేక్షకులను ఎలా అనుమతిస్తారని అన్నారు.
రాష్ట్రంలో కొవిడ్ భయంతో ఇంకా పాఠశాలలు మూసే ఉన్నాయని..వైరస్ భయం వల్ల విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారని ధీరజ్ తన వ్యాజ్యంలో పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో తమ దగ్గర జరిగే క్రికెట్ మ్యాచ్కు 100 శాతం మంది వీక్షకులను ఎలా అనుమతిస్తారని అడిగారు.
మ్యాచ్ను వాయిదా వేయడం లేదా 50 శాతం మంది వీక్షకులనే అనుమతిస్తూ నిర్ణయం తీసుకోవాలని న్యాయవాది ధీరజ్.. హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. భారత్-న్యూజిలాండ్ మధ్య మూడు టీ20ల సిరీస్ ప్రారంభమైంది. ఈ సిరీస్‌లో భాగంగా జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.