గూగుల్​ పే వాడుతున్నారా?..అయితే మీకు గుడ్ న్యూస్

Do you use Google Pay? .. But good news for you

0
90

ప్రముఖ డిజిటల్ చెల్లింపు సేవల సంస్థ ‘గూగుల్ పే’ భారత్​లో సరికొత్త ఫీచర్లను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. మాట్లాడడం ద్వారా అవతలి వారికి చెల్లింపులు చేసే విధంగా..స్పీచ్ టు టెక్స్ట్ఫీచర్​ను అందుబాటులోకి తేనున్నట్లు తెలిపింది. యాప్​లో హింగ్లీష్ (హిందీ ఇంగ్లీష్​ కలిసి) భాషను ఎంచుకునేందుకు “ఇండస్ట్రీ ఫస్ట్​ అండ్​ ఏ ఫస్ట్ ఫర్ గ్లోబల్లీ ఫీచర్”​ను కూడా తీసుకురానున్నట్లు ప్రకటించింది.

స్పీచ్ టు టెక్స్ట్ ఫీచర్​తో మాటల ద్వారా గూగుల్​పేలో కావాల్సిన ఖాతా నంబర్​కు పేమెంట్​ చేయొచ్చని అంబరీశ్ తెలిపారు. టైప్ చేసి పేమెంట్​ చేసేటప్పుడు ఎలాంటి భద్రత అయితే ఉంటుందో.. స్పీచ్ టు టెక్స్ట్ ఫీచర్​తోనూ అంతే భద్రత ఉంటుందని పేర్కొన్నారు. గ్రూపులుగా చెల్లింపులు చేసినప్పుడు బిల్లులను విభజించే సదుపాయాన్ని కూడా తీసుకురానున్నట్లు చెప్పారు.

కోటికిపైగా వ్యాపారులు గూగుల్​ పేను వినియోగిస్తున్నారని అంబరీశ్​ తెలిపారు. ప్రతిరోజు కొత్త వ్యాపారులు గూగుల్​ పేలో చేరుతున్నారని చెప్పారు. మైషాప్​ ఫీచర్​..వ్యాపారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. 7వ గూగుల్ ఫర్ ఇండియా ఈవెంట్​లో పాల్గొన్న ఆయన ఈ ఫీచర్లను ప్రకటించారు.