టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎమ్మెల్యే రోజా కౌంటర్ (వీడియో)

MLA Roja counter to TDP chief Chandrababu

0
110

ఏపీ​ శాసనసభలో జరిగిన పరిణామాలపై టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. వైకాపా సభ్యులు ఏకంగా ఆయన సతీమణి భువనేశ్వరిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని కన్నీటి పర్యంతమయ్యారు. మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెక్కి వెక్కి ఏడ్చారు.

దీనిపై స్పందించిన ఎమ్మెల్యే రోజా విధి ఎవర్ని వదిలిపెట్టదు. అందరి సరదా తీరుస్తది అంటూ కౌంటర్ ఇచ్చారు. గతంలో ఎన్టీఆర్ ని ఎంత ఏడిపించావో గుర్తుందా. మనం ఏం చేస్తామో అది మనకు తిరిగి వస్తుంది. ఈరోజు నీ భార్యను అన్నంత మాత్రాన అలా అంటున్నావ్. గతంలో రోజా బ్లూ ఫిల్మ్ సీడీలంటూ లంటు చూపించినప్పుడు చంద్రబాబుకు గుర్తు లేదా అని ఎమ్మెల్యే రోజా కౌంటర్ ఇచ్చారు.

వీడియో కోసం కింది లింక్ ను క్లిక్ చేయండి

https://www.facebook.com/alltimereport/videos/4914439958603473