ఇండోనేషియా మాస్టర్స్​లో భారత్ జోరు

Bharat Joru in Indonesian Masters

0
92

ఇండోనేషియా మాస్టర్స్ సూపర్​ 750లో భారత్​ జోరు కొనసాగుతోంది. బాలిలో శుక్రవారం జరిగిన క్వార్టర్​ ఫైనల్లో ఘన విజయాలతో సెమీస్​లోకి స్టార్​ షట్లర్లు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ అడుగు పెట్టారు.

మహిళల సింగిల్స్​లో టర్కీకి చెందిన నెస్లిహాన్​​ ఇగిట్​పై 21-13, 21-10 తేడాతో వరుస సెట్లలో గెలుపొందింది సింధు. 35 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్​లో సింధు ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించింది.

హెచ్​ఎస్​ ప్రణయ్​పై 21-7, 21-18 తేడాతో వరుస సెట్లలో గెలిచిన శ్రీకాంత్..సెమీస్​కు దూసుకెళ్లాడు. తొలి సెట్​లో ఘోర పరాభవం చవి చూసిన ప్రణయ్​..రెండో సెట్​లో పుంజుకున్నట్లు కనిపించినా చివరికి శ్రీకాంత్​  పైచేయి సాధించాడు.