క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగలాంటి వార్త..అదేంటంటే?

Festive news for cricket fans..is that so?

0
99

క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగలాంటి వార్త. వచ్చే ఏడాది ఏప్రిల్ లో జరగనున్న ఐపీఎల్ 15వ ఎడిషన్ షెడ్యూల్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఇండియాలో జరగనున్న ఈ మెగా టోర్నమెంట్ చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా 2022, ఏప్రిల్ 2వ తేదీన ప్రారంభం కానుందట. తొలి మ్యాచ్ లో చెన్నై, ముంబయి ఇండియన్స్ తలపడనున్నట్లు సమాచారం.

వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్-15వ సీజన్ ప్రేక్షకులకు డబుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వనుంది. ఇప్పుడున్న 8 జట్లతో పాటు కొత్తగా మరో రెండు జట్లు పాల్గొనబోతుండటంతో టోర్నమెంట్ మరింత ఉత్కంఠభరితంగా సాగనుంది. అలాగే సీజన్ ప్రారంభం కంటే ముందు మెగా ఆక్షన్ కూడా ఉంటుంది.

ప్రస్తుతం ఉన్న ఫ్రాంచైజీలు నలుగురు ప్లేయర్స్‌ను రిటైన్ చేసుకుంటారు. ఇక ఆ లిస్టు మొత్తాన్ని ఫ్రాంచైజీలు నవంబర్ 31న రిలీజ్ చేస్తాయి. ఆ తర్వాత రెండు కొత్త జట్లు విడుదలైన జాబితా నుంచి గానీ ఆక్షన్‌లోకి వచ్చిన ఆటగాళ్లలో నుంచి ముగ్గురిని గానీ డిసెంబర్ 25లోగా ఎంపిక చేసుకుంటాయి.