ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి

Four killed in road accident

0
94

తెలంగాణ: రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రమాదాలు జరుగకుండా పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా జరుగుతూనే ఉన్నాయి. నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం, మద్యం తాగి, ఓవర్‌టెక్‌, అతివేగం కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతూ అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.

కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున ఓ కారు అదుపుతప్పి మానకొండూరు పోలీస్ స్టేషన్ సమీపంలో చెట్టును ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు దుర్మరణం చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని కరీంనగర్‌లోని దవాఖానకు తరలించారు. మృతులు కరీంనగర్‌లోని జ్యోతినగర్‌కు చెందినవారిగా గుర్తించారు. ప్రమాదానికి వేగమే కారణమా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.