టీమ్ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య 2015లో ముంబయి ఇండియన్స్‌కు ఆడటం ప్రారంభించిన తర్వాత వెలుగులోకి వచ్చాడు. ఎన్నోసార్లు ఒంటిచేత్తో విజయాలనందించి జట్టులో కీలక ఆటగాడిగా మారాడు. అయితే ఫిట్‌నెస్ సమస్యల కారణంగా గత కొన్ని నెలలుగా అతని ఆటతీరులో నిలకడ లోపించింది.
వరుసగా వైఫల్యాలు ఎదుర్కొంటున్నాడు. స్టార్ ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్న పాండ్యా.. ప్రస్తుతం ఆ పేరుకు పూర్తి న్యాయం చేయలేకపోతున్నాడు. బౌలింగ్ చేయడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ కారణంగానే న్యూజిలాండ్‌తో సిరీస్‌కు టీమిండియాలో చోటు కోల్పోయాడు. ఇక తాజాగా జరిగిన ఐపీఎల్ రీటెన్షన్-2022 ప్రక్రియలోనూ ముంబయి ఇండియన్స్ అతడిని వదిలేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్‌లను ఆ జట్టు రిటెయిన్ చేసుకుంది. హార్దిక్ పాండ్యకు రిటెయిన్ ఆటగాళ్ల జాబితాలో చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో ముంబయి ఇండియన్స్‌తో తన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ హార్దిక్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్టు చేశాడు.
‘ఈ జట్టుతో నా ప్రయాణం, జ్ఞాపకాలను జీవితాంతం నాతో పాటు ఉంచుకుంటాను. నేను చేసిన స్నేహాలు, ఏర్పడిన బంధాలు, ప్రజలు, అభిమానులకు నిరంతరం కృతజ్ఞలతో ఉంటాను. మేం కలిసి ఆడాం..కలిసి పోరాడాం..కలిసి గెలిచాం..కలిసి ఓడిపోయాం. ఈ జట్టుతో నేను గడిపిన ప్రతి క్షణానికి నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎంత గొప్ప బంధాలకైనా ఎప్పుడో ఒకసారి ముగింపు ఉంటుందంటారు. కానీ ముంబయి ఇండియన్స్ నా హృదయంలో నిలిచి ఉంటుంది’ అని భావోద్వేగంతో రాసుకొచ్చాడు. దీనితో వచ్చేసారి పాండ్య ముంబయికి ఆడకుండా మరో ఫ్రాంచైజీకి ఆడనున్నట్లు తెలుస్తుంది.
https://www.instagram.com/reel/CW-xB-JKh6L/?utm_source=ig_web_copy_link