టీమిండియాతో రెండో టెస్టులో భాగంగా న్యూజిలాండ్ ఆలౌట్ అయింది. కేవలం 62 పరుగులుకే తొలి ఇన్నింగ్స్ ముగించింది. రెండో రోజు ఆటలో భాగంగా తొలుత భారత్ 325 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత బౌలర్ల విజృంభణతో కివీస్ కేవలం 62 పరుగులకే కుప్పకూలడం విశేషం. అశ్విన్ 4 వికెట్లు పడగొట్టగా.. సిరాజ్ 3 వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్ రెండు, జయంత్ యాదవ్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
కివీస్ విలవిల..62 పరుగులకే ఆలౌట్
Kiwis are worth..62 all out