కరోనా అప్ డేట్: 559 రోజుల కనిష్ఠానికి యాక్టివ్ కేసులు..మరణాలు ఎన్నంటే?

Corona update: Active cases for a minimum of 559 days..what are the deaths?

0
81
Covid-19 background. Stop spread and eliminate Coronavirus. Pandemics coronavirus. Epidemic backround. Healthcare background. Hands in blue medical gloves tearing the paper with covid-19 print

భారత్ లో కొవిడ్ వ్యాప్తి స్థిరంగా కొనసాగుతోంది. కొత్తగా 7,992 కేసులు వెలుగులోకి వచ్చాయి. 393 మరణాలు సంభవించాయి. శుక్రవారం 76,36,569 మందికి టీకాలు అందించారు. 24 గంటల వ్యవధిలో 9,265 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 559 రోజుల కనిష్ఠానికి చేరింది.

మొత్తం కేసులు: 3,46,82,736

మొత్తం మరణాలు: 4,75, 128

యాక్టివ్ కేసులు: 93,277

కోలుకున్నవారు: 3,41,14,331

దేశవ్యాప్తంగా టీకా పంపిణీ కార్యక్రమం మాత్రం జోరుగా సాగుతోంది. శుక్రవారం 76,36,569 మంది లబ్ధిదారులకు వ్యాక్సిన్ అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 1,31,99,92,482కి చేరింది.

అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా 6,08,765 కేసులు వెలుగు చూశాయి. మొత్తం 7,608 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల వ్యవధిలో 458,136 మంది కోలుకున్నారు. అన్ని దేశాల్లో కలిపి రెండు కోట్లకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి.