దక్షిణాఫ్రికా పర్యటన కోసం త్వరలో ఎంపిక చేయనున్న వన్డే జట్టులో.. యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్‌కు చోటివ్వాలని మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్ సర్కార్ సూచించాడు. ఇప్పుడు అతడి వయసు 24 ఏళ్లని.. ఈ సమయంలోనే అతడిని టీమ్ఇండియాకు ఎంపిక చేస్తే బాగుంటుందని తన అభిప్రాయాన్ని తెలిపాడు.
రుతురాజ్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో శతకాల మోత మోగిస్తున్నాడు. అతడిని నేరుగా దక్షిణాఫ్రికా పర్యటనకు పంపించవచ్చు. మూడో స్థానంలో కూడా అతడు అద్భుతంగా రాణించగలడు. అందుకే, అతడికి దక్షిణాఫ్రికాతో జరుగనున్న వన్డే సిరీస్‌లో కచ్చితంగా అవకాశం ఇవ్వాలని దిలీప్ వెంగ్‌సర్కార్ పేర్కొన్నాడు.
ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హాజారే ట్రోఫీలో మహారాష్ట్ర జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రుతురాజ్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. దాంతో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున ఆడుతున్న అతడు గత సీజన్‌లో అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు.