టెస్టులకు టీమిండియా స్టార్ ప్లేయర్ గుడ్‌బై?

Goodbye Team India star player for Tests?

0
97

టీమ్‌ఇండియాలో పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇప్పటికే తొడ కండరాల గాయంతో రోహిత్‌శర్మ దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు దూరమవగా..వన్డేలకు అందుబాటులో ఉండనని విరాట్‌ కోహ్లీ బీసీసీఐకి సమాచారం ఇచ్చినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

తాజాగా స్టార్ ఆల్‌రౌండర్‌ జడేజా టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వన్డేలు, టీ20 ఫార్మాట్లలో ఎక్కువ కాలం కెరీర్‌ కొనసాగించడానికి టెస్టులకు వీడ్కోలు పలకాలని 33 ఏళ్ల జడేజా నిర్ణయించుకున్నట్లు అతని సన్నిహితుడు తెలిపాడు.

మూడు ఫార్మాట్లలోనూ టీమ్‌ఇండియాకు జడేజా తిరుగులేని ఆల్‌రౌండర్‌గా సేవలందిస్తున్నాడు. బౌలింగ్‌, బ్యాటింగ్‌తో రాణిస్తున్న జడేజాకు ఫీల్డింగ్‌లో ఎదురేలేదు. మెరుపు వేగంతో అతను విసిరిన త్రోలు మ్యాచ్‌లను మలుపు తిప్పిన సందర్భాలు ఎన్నో. ఇప్పటి వరకు 57 టెస్టులాడిన జడేజా 2195 పరుగులు చేసి, 232 వికెట్లు తీశాడు. టెస్టు క్రికెట్లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన ఎడమచేతి వాటం బౌలర్‌గానూ జడేజా రికార్డు సృష్టించాడు.