టీమ్ఇండియా యువ పేసర్ నటరాజన్ జాతీయ జట్టులో అరంగేట్రం చేసి ఏడాది పూర్తి కావొస్తోంది. 2020-21లో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా తొలి మ్యాచ్ ఆడిన నటరాజన్.. తర్వాత జట్టు తరఫున అన్ని ఫార్మాట్లలో ఆడాడు.
ఈ సందర్భంగా సొంతూల్లో క్రికెట్ మైదానం ఏర్పాటు చేయాలనే కలను నిజం చేయబోతున్నట్లు చెప్పుకొచ్చాడు నటరాజన్. దీనికి సంబంధించి ఓ తాజాగా ఓ ట్వీట్ చేశాడు. భారత్ తరఫున ఓ టెస్టు, రెండు వన్డేలు, నాలుగు టీ20లు ఆడిన నటరాజన్ 13 వికెట్లు పడగొట్టాడు. ఇటీవలే జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తమిళనాడు జట్టు తరఫున ఆడాడు.
https://twitter.com/Natarajan_91
ఐపీఎల్లో సన్‌రైజర్స్ తరఫున ఆడిన నటరాజన్ అనేకసార్లు కీలక వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు. ఎస్ఆర్హెచ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా నటరాజన్‌పై ప్రశంసలు కురిపించాడు.