భారత అథ్లెట్, పరుగుల రాణి పీటీ ఉషపై కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ అథ్లెట్ జెమ్మా జోసెఫ్ ఫిర్యాదు మేరకు ఉషపై కేసు నమోదు చేసినట్లు కోజికోడ్ పోలీసులు తెలిపారు. ఇంటి నిర్మాణం కోసం కొంత మొత్తాన్ని చెల్లించానని, అయితే, హామీ ఇచ్చిన గడువులోగా ఇల్లు పూర్తి కాలేదని ఫిర్యాదుదారు జెమ్మా ఫిర్యాదు చేశారు.
ఈ సమస్యను పరిష్కరించేందుకు ఫిర్యాదుదారు కేరళ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీకి కూడా వెళ్లారు. అయినప్పటికీ, డబ్బులు తిరిగి చెల్లించేందుకు బిల్డర్ గానీ, పిటి ఊష గాని అంగీకరించలేదని ఫిర్యాదులో పేర్కొంది. కాగా, ఉషతో పాటు మరో ఆరుగురిపై ఐపీసీ 420 కింద కేసు నమోదు చేశారు.